Singer Sunitha: అభిమానులకు శుభవార్త తెలిపిన సునీత..బ్లెస్సెడ్ అంటూ పోస్ట్.. శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్స్!

Singer Sunitha: ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం తన భర్త బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ, బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ సునీత ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా సునీత ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రెండవ వివాహం తర్వాత ఈమె చాలా సంతోషంగా ఉందనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే సునీత ఖాళీగా ఉన్న సమయాలలో వ్యవసాయ పనులు చేస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సునీత తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సునీత పచ్చి మామిడి పండ్లను చూపిస్తూ ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఈ విధంగా పచ్చి మామిడి పండ్లను చూపెడుతూ ఈ ఫోటోకి బ్లెస్సెడ్ అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా తల్లి కాబోతున్న సమయంలోనే ఎవరికైనా మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది. అలాగే సునీత బ్లెస్సెడ్ అని క్యాప్షన్ ఇవ్వడంతో ఈమె తల్లి కాబోతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సునీత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఆమె తల్లి కాబోతోంది అంటూ పెద్దఎత్తున తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి నిజంగానే సునీత తల్లి కాబోతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.