Siddaarth: పాన్ ఇండియా సినిమాలలో నిజాయితీ లోపిస్తోంది : సిద్ధార్థ్

Siddaarth: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి మనందరికీ తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో ఒకానొక సమయంలో ప్రేక్షకులను బాగా అలరించిన హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ చెరగని ముద్రను వేసుకున్నాడు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవలే మహా సముద్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ సినిమాలలో కంటే వివాదాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు. కొన్నిసార్లు రాజకీయాలపై, మరికొన్నిసార్లు సినిమాలపై సెటైర్లు వేస్తూ ఉంటాడు.

ఒక్కోసారి తాను కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అన్న విషయాన్ని మర్చిపోయి మరి సినీ ఇండస్ట్రీ వారిపై పంచులు వేస్తూ ఉంటారు. ఇటీవలే సమంత విడాకుల విషయంలో స్పందించిన విషయం తెలిసిందే. ఆ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సమంత అభిమానులు సిద్ధార్థ్ ను దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. ఆ తరువాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు రకాల కామెంట్లు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా మరొకసారి కామెంట్లు చేసి సోషల్ మీడియాలో నిలిచారు సిద్ధార్థ్.

ఒక సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడానికి కలెక్షన్లే వేసుకోవాలా? అసలు లెక్కలు పక్కనపెట్టి కలెక్షన్లలో చూపించడానికి నిర్మాతలు ఎంత కమిషన్ ఇస్తారు? మీడియా కూడా ఫేక్ మెంబర్స్ ని ఎలా ప్రచారం చేస్తుంది నాకు అర్థం కావడం లేదు.. అన్ని భాషల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటే పాన్ ఇండియా సినిమాల్లో నిజాయితీ లోపిస్తోంది అనే భావన వచ్చేలా ట్వీట్ చేశాడు. అయితే సిద్ధార్థ్ ఈ ట్వీట్ ను పుష్ప సినిమా కలెక్షన్ల ను ఉద్దేశించి చేశాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా తాజాగా తిరుపతిలో పుష్ప చిత్రబృందం సక్సెస్ పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా యాంకర్ ఉదయభాను అనుకోకుండా పుష్ప సినిమా నాలుగు రోజుల్లోనే 2003 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ కామెంట్లు మొదలయ్యాయని స్పష్టమవుతోంది .