Home News 2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా చాలా మంది సెల‌బ్స్ వేద మంత్రాల సాక్షిగా ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ రోజు వ‌రుణ్ ధావ‌న్ త‌న ప్రేయ‌సి న‌టాషా ద‌లాల్‌ను వివాహం చేసుకున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్ కూడా అలియాను వివాహ‌మాడ‌నున్నాడు.

Uthii | Telugu Rajyam

ఇక ఇప్పుడు కొత్త‌గా క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ టాపిక్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయిన శృతి హాస‌న్ ఆ మ‌ధ్య మేఖేల్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో మునిగి తేలింది. చెట్టాప‌ట్టాలు వేయ‌డం, గ్యాప్ దొరికితే ఫుల్ మ‌స్తీ చేయ‌డం వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయ‌డం వంటివి చేశారు. తాజాగా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించిన శృతిని ఈ ఏడాది మీ పెళ్లి అని ఓ నెటిజ‌న్ అడ‌గా దానికి త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానం ఇచ్చింది శృతి.

ఈ ఏడాది మీ పెళ్ళి అంట‌గా అని ఓ నెటిజ‌న్ అడ‌గ‌గా, దానికి స‌మాధానంగా అది ముమ్మాటికి జ‌ర‌గ‌ద‌ని చెప్పింది. తర్వాత ఓ అభిమాని మీరు మీ మాజీ ప్రియుడు మైఖెల్‌ను అసహ్యించుకుంటున్నారా? అని అడిగాడు. దానికి శృతి అసహ్యించుకోను, కాక‌పోతే కొంత బాధ‌ప‌డ‌తాను అని చెప్పుకొచ్చింది. మీరు ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్నారా అని అడ‌గ‌గా, దానికి ఏడేళ్ళ క్రిత‌మే జరిగింది. దాని గురించి ఇప్పుడెందుకు అని చెప్పుకొచ్చింది. క్రాక్‌ ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదన్న క్వశ్చన్‌కు బిజీగా ఉన్నానని బదులిచ్చింది. ప్ర‌స్తుతం పవన్‌ కల్యాణ్‌ సరసన వకీల్‌ సాబ్‌లో నటిస్తోంది. 

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News