Shruti Haasan : లేటెస్ట్ అప్డేట్ : ప్రభాస్ భారీ సినిమాలో శృతి హాసన్ లుక్, రోల్ ఏమిటో క్లియర్.!

Shruti Haasan : మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో దాదాపు అన్ని రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారు చాలా తక్కువే ఉన్నారు. అలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో శృతి హాసన్ కూడా ఒకామె. మరి శృతి హాసన్ ప్రస్తుతం తక్కువ సినిమాలే చేస్తున్నా చేసే సినిమాలు మాత్రం భారీ స్థాయిలోవే ఉన్నాయని చెప్పాలి.

అలా తాను హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమానే “సలార్”. కన్నడ ఇండస్ట్రీ దర్శకుడు “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఇంకో సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను చాలా కాలం తర్వాత పక్కా మాస్ రోల్ లో చూపిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఈరోజు కొత్త అప్డేట్ ని రివీల్ చేశారు.

ఈ సినిమాలో శృతి హాసన్ లుక్ మరియు ఆమె చేస్తున్న రోల్ తాలూకా పేరు ఏమిటి అనేవి వెల్లడించారు. ఈ సినిమాలో ఈమె “ఆద్య” అనే పాత్రలో కనిపించనుండగా ఈమె లుక్ ని ఈ సినిమాకి చాలా సింపుల్ గానే డిజైన్ చేసినట్టుగా ఈ కొత్త పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది.

అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా సినిమా సెట్స్ ఆ బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాని కేజీఎఫ్ నిర్మాతలే నిర్మాణం వహిస్తుండగా దాదాపు ఆ సినిమాకి వర్క్ చేసిన వారే పని చేస్తున్నారు.