నటనతో పాటు పాట కుడా నా జీవితంలో భాగమే.. పాటను మాత్రం వదలను: శృతిహాసన్

తమిళ స్టార్ హీరో కమలహాసన్ కుమార్తె శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న శృతిహాసన్ తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన శృతి హాసన్ ఇటీవల మళ్లీ సినిమాలలో నటిస్తోంది. శృతిహాసన్ నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల సరసన గబ్బర్ సింగ్, రేసుగుర్రం , క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన శృతి హాసన్ ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కొంతకాలం నటనకు విరామం ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్టేజ్ షోలు ఇచ్చిన శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత పాటకి దూరమయ్యింది. ఇటీవల దాని నుండి బయట పడి మళ్లీ నటిగా కెరీర్ ప్రారంభించింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన పాట గురించి అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చింది. లండన్లో సింగర్ గా ఎన్నో లైవ్ షో లు ఇచ్చిన శ్రుతి హాసన్ నటనతో పాటు సంగీతం కూడా తన జీవితంలో ఒక భాగమే అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సంగీతం పట్ల తనకున్న ఇంట్రెస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా ఇలా స్టేజ్ షోలు చేయటం కుదరలేదు అని.. ఫ్యూచర్లో మళ్లీ ఇలా తప్పకుండా సింగింగ్ చేస్తానని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం పాటకి కొంచం గ్యాప్ వచ్చింది. ఫ్యూచర్ లో సోలో పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ అలరిస్తానని శ్రుతి హాసన్ వెల్లడించారు .