Sruthi Hassan: ఆ విషయంలో హీరో తగ్గితే… నేను తగ్గుతా అంటున్న శృతి హాసన్..!

Sruthi Hassan: కమలహాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంట్ తో టాప్ హీరోయిన్ అయింది అటు నటన, డాన్సులతో ఆదరగొట్టడమే కాకుండా గాయని గాను గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సినిమాల జోరు తగ్గించినా తిరిగి ఫామ్ లోకి క్రాక్ సినిమాతో వచ్చి కేక పుట్టించింది.తమిళ తెలుగు సినిమాలతో బిజీ గా ఉన్న శృతి సలార్ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.

కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ టైంలో హీరోయిన్ ల రెమ్యూనరేషన్ గురించి పెద్ద చర్చే జరిగింది అటు టాలీవుడ్ లోను ఇటు కొలీవుడ్ లోను హీరోయిన్ లు పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్ లు వినిపించాయి. అయితే తెలుగు హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గలేదు. ఈ విషయం గురించే శృతి ప్రస్థావిస్తూ తనను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని సదరు నిర్మాత అడుగగా మొదట అంగీకరించినా హీరో కూడా తగ్గించుకుంటే తాను తగ్గించుకుంటానని సమాధానమిచ్చింది.

హీరో రెమ్యూనరేషన్ తో పోలిస్తే హీరోయిన్స్ చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారు. వారితో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదు అది సరైంది కాదు అని చెప్తూనే ఎక్కువ మొత్తం పారితోషకం తీసుకునే హీరోలను తగ్గించుకోమనడం సరైందని తక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్ లను తగ్గించుకోమనడం కరెక్ట్ కాదని వెల్లడించింది.అయితే అలా రెమ్యూనరేషన్ తగ్గించుకోమన్న ప్రొడ్యూసర్ ఎవరు…, సినిమా ఏదో మాత్రం చెప్పలేదు.