RRR Movie Total Leaked In Youtube : షాకింగ్ : “RRR” సినిమా అంతా యూట్యూబ్ లో.. చేసింది వీళ్ళే అట.!

RRR Movie Total Leaked In Youtube : గత వారం ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాని ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.

అయితే ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని భాషల్లో కూడా సూపర్ రెస్పాన్స్ రాగా భారీ కలెక్షన్స్ కూడా ఇది సాధించింది. అయితే తెలుగు సినిమా ఎదుగుదల పట్ల మాత్రం ఓ ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు సహించలేకపోతున్నారు. ఆ రకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన భారీ సినిమా “రాధే శ్యామ్” హైప్ ని లాస్ట్ లో కిల్ చేశారు.

ఇక ఇప్పుడు RRR కి అలాగే చేస్తున్నారు. ఇంతకీ ఆ ఇండస్ట్రీ ఏంటో చెప్పలేదుగా అదే బాలీవుడ్ ఇండస్ట్రీ. చాలా వరకు కొంతమంది తెలుగు సినిమాని సపోర్ట్ చేసినా కొంతమంది అందులోని బడా వ్యక్తులే అక్కసుగా ఉన్నారు. లేటెస్ట్ గా అయితే కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ భారీ సినిమా హిందీ వెర్షన్ ని పూర్తిగా యూట్యూబ్ లో పెట్టేశారట.

దీనితో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఈ సినిమా సాలిడ్ వసూళ్లతో అదరగొడుతుండగా పైగా స్టడీగా దూసుకెళ్తుండడంతో దీనికి దెబ్బ కొట్టాలని సినిమా అంతటిని హిందీలో యూట్యూబ్ రిలీజ్ చేసేసారు. ఇది ఖచ్చితంగా కావాలని చేసిందే అని దీనిపై చిత్ర యూనిట్ తప్పక స్పందించాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.