RRR Movie Part 2 : ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న ఏకైక భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). మాసివ్ ట్రయో కాంబో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నుంచి వచ్చిన ఈ మోస్ట్ అవైటెడ్ సెన్సేషనల్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దంచి కొడుతుంది.
మొదటి వారం అయ్యేసరికి రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాపై ఇప్పుడు మరిన్ని ఆసక్తికర మాటలు స్టార్ట్ అయ్యాయి. ఈ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా అనే ప్రశ్న మొదటి నుంచి అందరిలో ఉంది.
అయ్యితే దీనిపై మాత్రం ఈ సినిమా రచయిత మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రభాస్ ఆశలు చిగురుంచేలా చేశారు.
మొదట అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచన లేదు కానీ ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. పైగా సీక్వెల్ కి సంబంధించి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గాని సెట్టయ్యి దేవుడి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా RRR కి పార్ట్ 2 ఉంటుంది అని సెలవిచ్చారు.
దీనితో ఇప్పుడు ఈ బిగ్ అప్డేట్ ఓ రేంజ్ లో సంచలనంగా మారిపోయింది. అయితే ఇదంతా ఎపుడు అవుతుందో కానీ రెండో సినిమా అయితే ఉన్నట్టే అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.
మరి రాజమౌళికి మళ్ళీ ఈ హీరోలకి ఎప్పుడు కుదురుతుందో మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందో చూడాలి.