ప్రభాస్ ఇప్పుడు తన భారీ సినిమాలు రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ సినిమాలు కంప్లీట్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత భారీ ఏక్షన్ డ్రామా “సలార్” ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంని మించి తాను చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే”.
యువ ఫిల్మ్ మేకర్స్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ లేని షూటింగ్స్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ అమితాబ్ మరియు దీపికా పదుకొనె లతో తీస్తున్నారు. అయితే ఈ సినిమాకి టాలెంటెడ్ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరి ఇప్పుడు తాను షాకిచ్చినట్టు తెలుస్తుంది. ఇదెలా తెలిసింది అంటే తమిళ సంగీత దర్శకుడు ‘కబాలి’ ఫేమ్ సంతోష్ నారాయణన్ ప్రభాస్ సినిమా నిర్మాతలు వైజయంతి మూవీస్ వారి ట్వీట్ కి రీట్వీట్ చేసాడు. దీనితో ఈ సినిమాకి సంతోష్ ఫిక్స్ అయ్యినట్టుగా వైరల్ అవుతుతోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.