Keerthy Suresh : షాకింగ్ : కీర్తి సురేష్ సినిమా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా?

Keerthy Suresh : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. మరి కీర్తి సురేష్ హీరోయిన్ గానే కాకుండా అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె ట్రాక్ రికార్డు ఏమంత అంత బాగాలేదు అని తెలిసిందే.

వరుసగా ఎనిమిది ప్లాప్ లను ఈమె అందుకుంది. దీనితో ఇప్పుడు ఈమెపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఇంకో షాకింగ్ న్యూస్ ఇప్పుడు తెలుస్తుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “గుడ్ లక్ సఖి” చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమా పరిస్థితి అసలు ఏమాత్రం బాగాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉండగా అసలు సినిమా రిలీజ్ కి పెట్టిన ఖర్చులు కానీ సినిమాకి అయ్యిన డ్రింక్స్ ఖర్చు కూడా వెనక్కి తిరిగి రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంటే ఈ లెక్కన ఈ చిత్రం ఎంతలా నష్టాలను మిగిల్చేలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఆదిపినిశెట్టి హీరోగా నటించగా జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించాడు.