Kajal Aggarwal Number : షాకింగ్ : నెట్టింట్లో కాజల్ ఫోన్ నెంబర్ లీక్..నమ్మకపోతే ట్రూ కాలర్ లో చూడొచ్చు.!

Kajal Aggarwal Number : మన టాలీవుడ్ లో మంచి స్టార్డం ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. కెరీర్ ఆరంభించి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది ఈ హాట్ బ్యూటీ. దాదాపు టాలీవుడ్ లో అందరి యంగ్ హీరోలు సీనియర్ హీరోలతో నటించేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకొని బిజీగా ఉంది.

అయితే కొన్ని సినిమాలు కూడా చేస్తున్నా ఒక ఆసక్తికర సంఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది వినడానికి షాకింగ్ గానే ఉన్నా నిజంగానే కాజల్ అగర్వాల్ ఫోన్ నెంబర్ బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఇందులో మెయిన్ కథ ఏమిటంటే రీసెంట్ గా కాజల్ తన ఫ్రెండ్ ఒకామెతో వీడియో చాట్ చెయ్యడం జరిగింది. దానిని కాజల్ ఫ్రెండ్ వీడియో చాట్ స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పంచుకుంది అంతే ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అసలు రచ్చ.

ఎందుకంటే ఈ స్క్రీన్ షాట్ లో ఇద్దరి నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏమో ఎడిట్ చేసింది కూడా కావచ్చు అని అనుకుంటే తీరా ట్రూ కాలర్ లో సెర్చ్ చేసి చూస్తే ఆ నెంబర్ తో పేరు కాజల్ అగర్వాల్ అనే వస్తుంది. దీనితో ఇది చూసిన నెటిజన్స్ ఒకింత షాక్ అవుతున్నారు.

మరికొంత మంది అయితే కాల్ చెయ్యాలా వద్దా అనే సంశయంలో కూడా ఉన్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఫోన్ నెంబర్ లీక్ సోషల్ మీడియాలో నడుస్తుంది.