Pawan Kalyan Janasena : హాట్ న్యూస్ : పవన్ పార్టీ లోకి బండ్ల గణేష్? సంచలన క్లారిటీ ఇచ్చిన బండ్ల!

Pawan Kalyan Janasena : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముందు కన్నా ఇప్పుడు కాస్త క్లారిటీ గా ఉన్నాడని చెప్పాలి. తన సినిమాల పరంగా కానీ అలాగే తన రాజకీయ పార్టీ జనసేన పనుల్లో కానీ కాస్త బ్యాలన్స్ గానే అడుగులు వేస్తూ వెళ్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కి ఉన్న మద్దతు ఎంత ఉందో తెలీదు కానీ..
సినిమాల పరంగా అయితే పవన్ ని అభిమానించే వారు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు. అయితే అలాంటి వారిలో బడా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. సినీ నటుడు, నిర్మాతగానే కాకుండా పవన్ కళ్యాణ్ కి తాను పెద్ద అభిమాని అని తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన పని లేదు.
అయితే పవన్ పార్టీ ఒకటి కాగా బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ అంటూ ఉంటాడు. తెలంగాణాలో తనకి తగిలిన దెబ్బతో మళ్ళీ రాజకీయాల్లో ఉండనని చెప్పేసాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పవన్ జనసేన పార్టీ జనసేన పార్టీలో చేరుతాను అన్నట్టు హింట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్న కి గాను జనసేనలో మెగాస్టార్ చేరాలని కోరాడు దీనికి తాను మాట్లాడుతూ “మరి నేనో” అంటూ రిప్లై ఇచ్చాడు. దీనితో జనసేన పార్టీ లోకి తాను కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు బండ్ల గణేష్ హింట్ ఇవ్వడం పవన్ అభిమానుల్లో ఆసక్తిగా మారిపోయింది. మరి బండ్ల గణేష్ నిజంగానే పవన్ పార్టీలో చేరుతాడో లేదో చూడాలి.
https://twitter.com/ganeshbandla/status/1509032566090702849?s=20&t=w_ubim5uTh-cZ4KIByZkIA