బిగ్ ట్విస్ట్: రకుల్ వైవాహిక జీవితం ఏమవనుంది.?

Astrologers Shocker About Rakul Preet Singh Married Life | Telugu Rajyam

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ వివరాల్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బాలీవుడ్ నటుడు జాకీ బగ్నానితో తాను ప్రేమలో వున్నట్లు వెల్లడించిన రకుల్, త్వరలో తాము పెళ్లి పీటలెక్కనున్న వైనం గురించి చూచాయిగా పేర్కొన్న విషయం విదితమే.

అయితే, రకుల్ – జాకీ బగ్నానీ అసలు పెళ్ళి చేసుకునే అవకాశమే లేదనీ, ఇద్దరికీ బ్రేకప్ అయిపోతుందనీ, ఒకవేళ పెళ్ళి జరిగినా వారి వైవాహిక జీవితం ఎక్కువ రోజులు నిలబగే ప్రసక్తే లేదని ‘జోస్యం’ చెప్పేస్తున్నారు కొందరు. సమంత – నాగచైతన్య విషయంలో జోస్యం చెప్పిన మేథావులే, ఇప్పుడు రకుల్ విషయంలోనూ సంచలన విషయాల్ని బయటపెడుతున్నారు.

పెళ్ళికి ముందు పక్కాగా జాతకాలు చూసి మరీ, అంగరంగ వైభవంగా వైవాహిక వేడుకని నిర్వహించినా.. ఆయా బంధాలు అనూహ్యంగా తెగిపోతుంటాయి. అలాంటిది.. రకుల్ – జాకీ బగ్నానీ ఇంకా ప్రేమలోనే వున్నారు. వారి ప్రేమ ఏమవుతుంది.? పెళ్ళి పీటలెక్కుతుందా.? ఆ తర్వాత ఏమవుతుంది.? ఇవన్నీ ఇప్పుడు అసందర్భ ప్రస్తావనలే.

రకుల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. పెళ్ళి మీద ఆమెకు పూర్తి క్లారిటీ వుంది. వైవాహిక జీవితం నిలబడటం.. నిలబడకపోవడం.. అనేది కాలం నిర్ణయిస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles