టీవీ9 పై డైరెక్ట్ గానే సంచలన కామెంట్స్ చేసిన ‘RRR’ నటుడు.!

RRR Artist : గత రెండు రోజులు నుంచి తెలుగు సినిమా మరియు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా కి సంబంధించి ఓ హీరో విషయంలో పెద్ద దుమారమే లేస్తుంది. అయితే మన మీడియా ఇప్పుడు చేస్తున్న పాటిస్తున్న విలువల కోసం పెద్దగా చెప్పుకోకపోయినా తెలుగు ప్రేక్షకులకి అయితే అన్ని ఛానెల్స్ కూడా ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు.

మరి ఈ క్రమంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” ప్రమోషన్స్ కి ప్లాన్ చేసుకున్న ప్రాంక్ ఏటో వెళ్లి ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ9 తో యుద్ధం వరకు వెళ్ళింది. ఈ మ్యాటర్ తాను హ్యాండిల్ చేసుకుంటా అని తాను చెప్పాడు. మరి ఇప్పుడు ఛానల్ తో విశ్వక్ సేన్ ఓపెన్ గానే యుద్ధం చేస్తుండగా..

తాజాగా మరో యంగ్ నటుడు రీసెంట్ భారీ చిత్రం RRR లో కనిపించిన నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన కామెంట్స్ ని తన సోషల్ మీడియాలో చెయ్యడం వైరల్ గా మారింది. డైరెక్ట్ గా అధికారిక టీవీ9 హ్యాండిల్ ని ట్యాగ్ చేసి మరీ ఈ ఛానెల్ యొక్క నీచ స్వభావం కోసం ఎవరూ మాట్లాడారు. ఈ టీవీ9 వాళ్ళు న్యూస్ తప్ప అన్నీ చూపిస్తారని వాళ్ళకి బాగా ఫండ్స్ వస్తుంటాయి.

అందుకే ఇలా అనవసర విషయాలను బూతద్దాల్లో పెట్టి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారని, నాకు ఈ టీవీ9 తో ప్రాబ్లెమ్ ఉంది ఎందుకంటే వీళ్ళు అసలు ఏ భాగానికి కూడా చెందిన వాళ్ళు కాదు వారి వార్తలు కేవలం డబ్బుకి సంబంధించినవే తప్ప ప్రజల కోసం ఎలాంటి ఉపయోగపడే వార్తలు చూపించకపోవడం సిగ్గు చేటు అంటూ షాకింగ్ కామెంట్స్ తాను చేసాడు. అలాగే తాను విశ్వక్ సేన్ కి పూర్తి మద్దతు ఇస్తున్నానని బాహాటంగానే ఆ ఛానెల్ పై ఈ నటుడు సంచలన కామెంట్స్ చేసాడు.