Manchu Vishnu : షాకింగ్ : “మా” ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆఫీస్ లోనే చోరీ.. వివరాలు ఏమిటంటే.!

Manchu Vishnu : ఈ మధ్య కాలంలో మంచు వారి కుటుంబం సినీ వర్గాల్లో ఏదో రకంగా మంచి హైలైట్ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇది అంతా కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరిగిన “మా” ఎన్నికలు తర్వాత నుంచి మరింత ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. మంచు విష్ణు ఎన్నిక అయ్యాక చాలానే మార్పులు కనిపించాయి.
పైగా రీసెంట్ గా టికెట్ ధరల అంశంలో ఏపీ మంత్రులతో వీరి మీటింగులు తర్వాత మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా వరకు ఓ రేంజ్ హంగామా నడిచింది. మధ్యలో విష్ణు ఓ ప్రెస్ మీట్ తో కూడా వైరల్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. తన మా ఆఫీస్ లోనే ఏకంగా పెద్ద దొంగతనం జరిగిందట. ఇంతకీ ఏం దొంగతనం జరిగిందంటే విష్ణు కి సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ వస్తువులు పోయాయట.
అయితే హెయిర్ వే కదా అనుకుంటున్నారా అవి దాదాపు 5 లక్షల ఖరీదు చేసేవి అట. అందుకే విష్ణు బాబు చాలా సీరియస్ గా మారాడట. దీనిపై పోలీసు కేసు కూడా నమోదు చేసాడట. అలాగే ఈ దొంగతనం అతని హైర్ డ్రెస్సర్ నే చేసి ఉంటాడని విష్ణు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ కేసులో విష్ణు ఎక్కడ వరకు వెళ్తాడో చూడాలి.