Prabhas Fan Commit Suicide : నిజంగా తమ హీరోలని తన తల్లిదండ్రుల కన్నా దేవుడు కన్నా ఎక్కువగా కొలిచే అభిమానులు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారని చెప్పాలి. అది హద్దులు దాటి ఎక్కడెక్కడికో కూడా వెళ్ళిపోతుంది. అయితే ఇది ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది కానీ కాస్త పరిపక్వత లేని అభిమానం మాత్రం ఆ హీరోలను సైతం తల దించుకునేలా చేస్తుందని చెప్పాలి.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి అభిమానమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో చోటు చేసుకుందని చెప్పాలి. తాను నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” సినిమా చూసి మనస్తాపానికి గురైన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త షాకింగ్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే కర్నూల్ లో ముత్యాల రవితేజ అనే 24 ఏళ్ల యువకుడు ఎప్పటి నుంచో ప్రభాస్ కి వీరాభిమాని అట.
అయితే నిన్న ఎన్నో ఏళ్ల తర్వాత తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యిన సందర్భంగా స్నేహితలతో కలిసి షో చూశాడట. అయితే సినిమా తనకి నచ్చక తన హీరో మంచి విజయం అందుకోలేకపోయాడని వేదనకి గురయ్యి ఇంట్లో నిన్న శనివారం ఫ్యాన్ ని ఉరి వేసుకొని మరణించినట్టు తెలిసింది.
దీనితో దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అయినటువంటి తన తల్లిదండ్రులు ఎంతో రోదిస్తున్నారట. ప్రస్తుతం ఈ మరణానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇలాంటి అభిమానం ఏ హీరోకి కూడా తగనిది అని చెప్పాలి. అందుచేత అభిమానులు కూడా ఈ స్థాయి అభిమానాన్ని తగ్గించుకోవాలి.