Manchu Vishnu : ఇటీవల మళ్ళీ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మంచు వారి కుటుంబం నిలవడం స్టార్ట్ చేసింది. అప్పటికే సన్నాఫ్ ఇండియా సినిమా అంటూ సంచలనం రేపిన వీరు సోషల్ మీడియాలో మీమ్ పేజెస్ ని టార్గెట్ చెయ్యగా తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు ఆఫీస్ లో 5 లక్షల చోరీ అంటూ మరో వార్త షాకిచ్చింది.
అయితే ఇది బయటకి వచ్చి వైరల్ అవుతున్న క్రమంలో విష్ణు తన హెయిర్ డ్రెస్సర్ పై కేసును అనుమానితుడిగా నమోదు చేయగా అక్కడ నుంచి అతని హెయిర్ డ్రెస్సర్ వైపు తిరిగింది. అయితే ఇలా జరగడంతో అతడు ఓ సంచలన వీడియో ద్వారా అసలు జరిగిన విషయం ఏమిటో అనేది వెల్లడి చేసాడు.
మంచు విష్ణు దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా పని చేస్తున్నటువంటి నాగ శ్రీను అనే వ్యక్తి తనని మంచు విష్ణు బూతులు తిట్టడం వల్లనే మానేసానని తీరా చూస్తే ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారని వాపోయాడు. అంతే కాకుండా నన్ను నా తల్లిని చెప్పలేని స్థాయి బాండ బూతులు తిట్టేవారని కులాన్ని కూడా తీసి దూషించడంతో…
అలాంటి పెద్ద వాళ్ళ విషయంలో ఏమీ చేయలేక వారి దగ్గర నుంచి ఉద్యోగం మానేస్తే తీరా నా మీదనే కేసు పెట్టారని దయచేసి మా లాంటి చిన్నవాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని ఓ సంచలన వీడియో పెట్టి బయటకి వదిలాడు. దీనితో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి ఈ కేసులో ఎవరు చెబుతుంది నిజం అవుతుందో కాలమే నిర్ణయించాలి.