తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనానికి కారణాలివే.. పుంజుకోవడం సాధ్యమేనా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేయడంతో పాటు ఆ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం కాంగ్రెస్ పార్టీ పాలిట శాపమైంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అసాధ్యం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి బెటర్ గానే ఉన్నా అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో ఉన్న బలమైన నాయకులు ఇతర పార్టీలపై దృష్టి పెట్టి ఆ పార్టీలోకి వెళుతుండటం కూడా కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది.

తెలంగాణ విభజన వల్ల కేసీఆర్ తెలంగాణ సీఎం కాగా తెలంగాణలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్, మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ కు దూరంగా ఇతర పార్టీలలో ఉన్నారు. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కోమటిరెడ్డి బ్రదర్స్ వార్తల్లో నిలిచారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లే వాళ్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడం, సరైన నాయకత్వం లేకపోవడం, రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుండటం గమనార్హం. ఉమ్మడి ఏపీని విభజించడం వల్ల కాంగ్రెస్ కు వైఫల్యాలు ఎదురవుతూ ఉండటం గమనార్హం.