Shivaaji: శివాజీ వాళ్ళ నాన్న చనిపోయిన కూడా షూటింగ్ ఆ పని ఇవ్వలేదు అంత గొప్ప వ్యక్తి…!

Shivaaji: అప్పటికీ ఇప్పటికీ పోల్చుకుంటే ప్రొఫెషనాలిటీ చాలా తగ్గిందని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. టెక్నికల్ గా చాలా బెటర్ అయిందని, దాంతో సినిమా తీయడం ఈజీగా మారిపోయిందని చెప్పారు. అంటే ఇప్పుడు సినిమా తీయాలంటే ఎన్నో రకాలైన ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయని, అది చాలా పెద్ద అస్సెట్ అని ఆయన తెలిపారు. ఇప్పుడు ఏది కొత్తగా క్రియేట్ చేయాలన్నా కూడా చేయడానికి అవకాశం ఏర్పడింది. కానీ అప్పట్లో అంతగా సౌకర్యాలు లేవని ఆయన వివరించారు.

ఒకప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే వర్కింగ్ లో ప్రొఫెషనలిజం మాత్రం అంత సిన్సియర్ గా లేదని వేణుగోపాల్ అన్నారు. ప్రస్తుతం ఎవరి దగ్గర అది లేదని, అసలు ఎందుకు అది లోపించింది తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. జనరేషన్ పెరుగుతున్నా కొద్దీ టెక్నాలజీ ప్రాసెస్ మేకింగ్ అనేది ఎవరు చేయాలనుకున్నా చాలా ఈజీగా అయిపోయింది అని ఆయన చెప్పారు. ఇంతకు ముందు ఒక వీడియో తీయాలంటే కెమెరా పెట్టాలి.. సెట్ చేయాలి.. అలా కొన్ని ఉండేవని, ఇప్పుడు చాలా ఈజీగా ప్రక్రియ మారిపోయిందని ఆయన అన్నారు.

ఇకపోతే సత్యబామ సినిమా షూటింగ్ లో ఉండగానే హీరో శివాజీ గారి నాన్నగారు చనిపోయారని, షూటింగ్ మాత్రం ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా కంటిన్యూ చేశారని వేణుగోపాల్ అన్నారు ఒక్కరోజు అనుకుంటా ఆగిపోయారు. కానీ మిగతా ఎక్కడా కూడా ఆయన ఆగలేదని సినిమా అన్నా, పెద్దలు అన్న ఆయన చాలా వ్యాల్యూ ఇస్తారని, డబ్బును చాలా గౌరవిస్తారని అతను చాలా ప్రాక్టికల్ అని కూడా వేణుగోపాల్ చెప్పారు. గొప్పలకేమీ వెళ్లకుండా ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వం శివాజీ గారిది అని ఆయన అన్నారు. భవిష్యత్ కోసం ఆలోచించి ముందే జాగ్రత్త పడతారని, ఆ విషయంలో తను చాలా అజాగ్రత్తపరుడినని వేణుగోపాల్ తెలిపారు.