Bekkam Venu: హీరో శివాజీకి, తనకు మధ్య అందరూ అనుకుంటున్నట్టు ఎలాంటి అభిప్రాయ భేదాలూ లేవని నిర్మాత బెక్కం వేణు గోపాల్ అన్నారు. సినిమాను పక్కన పెడితే అంతకుముందే తామిద్దరూ రూమ్‌మేట్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తామిద్దరి మధ్య 10 ఏళ్ల రిలేషన్‌షిప్ ఉందని ఆయన అన్నారు. తెలియకుండానే తామిద్దరూ చాలా క్లోజ్ అయ్యామన్న ఆయన, తామిద్దర్లో ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఏమైనా జరిగితే వెంటనే ఫోన్ చేయాల్సిందేనని ఆయన తెలిపారు. మధ్యలో అతను కొంచెం బిజీ కావడం, తమ పనుల్లో నిమగ్నం కావడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందేమో గానీ, ఎట్టి పరిస్థితుల్లో తామిద్దరి మధ్య ఎక్కడున్నా సరే ఏం జరిగినా ఫోన్ కాల్ వస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
అంతే కాకుండా శివాజీది, తనది చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అన్న వేణు గోపాల్, అసలు తామిద్దరి మధ్య గ్యాప్ ఎలా ఏర్పడిందో ఈ విధంగా చెప్పుకొచ్చారు. మా ఆయన చంటిపిల్లాడు, బ్రహ్మ లోకం టు యమలోకం, ఇంకా 4 సినిమాల తర్వాత భాస్కర బట్ల ఏదైనా లవ్ స్టోరీ చేయాలనుకొని, అప్పుడు ఆ కథ స్టార్ట్ చేశారని, దాని కోసం హీరోగా కొత్త హీరోలను తనీష్‌లాంటి వారిని చూశామని ఆయన చెప్పారు. ఆ తర్వాత బూచమ్మ బూచోడు అనే కథను తానే సెట్ చేశానని అప్పట్లో అది బాగా ఆడిందని కూడా ఆయన తెలిపారు. ఆ తర్వాత ఇక ఎలాంటి సినిమాను చేయలేదని ఆయన అన్నారు. దానికి కొన్ని ఫినాన్షియల్ స్టేటస్ వంటి కారణాలున్నాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం మళ్లీ మరొక సినిమాను ప్లాన్ చేస్తున్నామని వేణు గోపాల్ అన్నారు. ఇంతకు ముందున్న శివాజీ వేరు, ఇప్పుడున్న శివాజీ వేరని దానికి తగ్గట్టు ఒక అందమైన స్ర్కిప్టును రాపిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న స్ట్రాంగ్ మీడియాలో అతని ఎంట్రీ కూడా ఉంటుందని వేణు గోపాల్ వివరించారు.