ఫైవ్ స్టార్ హోటల్ ని తలదన్నేలా శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్.. ఎన్ని కోట్లో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక సెలబ్రిటీ వారు కంటూ ప్రత్యేకమైన వ్యానిటీ వ్యాన్ ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న సెలబ్రిటీల నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.ఇప్పటికే ఇండస్ట్రీలో కొందరి సెలబ్రెటీలు కొన్ని కోట్లలో ఖర్చు చేసి వారి ఇష్టానికి అనుగుణంగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇకపోతే తాజాగా బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి సైతం ఖరీదైన వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వ్యాన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జూన్ 8వ తేదీ శిల్పాశెట్టి పుట్టిన రోజు కావడంతో ఆమె పుట్టినరోజు సందర్భంగా తనకు తానే గిఫ్ట్ గా ఖరీదైన వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే తన అభిరుచులకు అనుగుణంగా ఇందులో కిచెన్‌, హెయిర్‌ వాష్‌ రూమ్‌, యోగా డెక్‌ సహా అన్నింటినీ అమర్చుకుంది. ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు రాసి ఉన్నాయి. నలుపు రంగు లో ఉన్నటువంటి ఈ వ్యానిటీ వ్యాన్ ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్లో తలదన్నేలా ఉందని చెప్పాలి.

ఈ విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన వాహనం కోసం ఈమె ఏకంగా 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక శిల్పా శెట్టి సినిమాల విషయానికి వస్తే నికమ్మ చిత్రం జూన్‌ 17న రిలీజవుతోంది. అలాగే రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే గత కొంత కాలం క్రితం శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ కంటెంట్ సినిమాలను చిత్రీకరిస్తున్నారు అంటూ అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఈ వివాదంతో శిల్పాశెట్టి కొద్దిరోజులు పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.