మాష్టర్ వేసిన పంచ్ కి బిక్కమొహం వేసిన పండు.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు?

డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకడిగా పాపులర్ అయ్యాడు. శేఖర్ మాస్టర్ తన చూపులతోనే కాకుండా మాటలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ మరొకవైపు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఢీ షో లో చాలా కాలం జడ్జ్ గా ఉన్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ షోలో మెగా బ్రదర్ నాగబాబు కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కామెడీ స్టార్స్ షోలో కమెడియన్లు వేసే పంచులకు శేఖర్ మాస్టర్, నాగబాబు కూడా అప్పుడప్పుడు రివర్స్ పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈవారం జరగబోయే కామెడీ స్టార్స్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో పండు కూడా ఒక స్కిట్ చేశాడు. పండు డాన్సర్ గా, యాక్టర్ గా, కామెడియన్ గా కూడా బాగా పాపులర్ అయ్యాడు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న అన్ని టీవీ చానల్స్ లోని షోస్ లో పండు దర్శనమిస్తూ సందడి చేస్తూ ఉంటాడు.

ఈవారం ప్రసారం కాబోయే కామెడీ స్టార్ షో లో కూడా పండు సందడి చేశాడు. ఈ షోలో పండు ఒక ప్రొడ్యూసర్ గెటప్ లో కనిపించాడు. స్కిట్ లో భాగంగా పండు మాట్లాడుతూ..అన్ని కోరికలు తీర్చుకున్నారా.. కానీ ఒక కోరిక మిగిలింది అని అంటాడు. ఏమేమి కోరికలు తీర్చుకున్నవ్ అంటూ నాగబాబు, శేఖర్ మాస్టర్లు కౌంటర్లు వేశారు. తర్వత శేఖర్ మాస్టర్ తో సినిమా తీయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది అని పండు అనగా..ఇంతకీ సినిమా పేరేంటి అని పక్కనున్న వ్యక్తి అడుగుతాడు. “ఉండలేడు ఆగలేడు” అనే టైటిల్ అని పండు అంటాడు. దీంతో శేఖర్ మాస్టర్ స్పందించి ఆ టైటిల్ నాకు కాదు రా నీకు బాగా సెట్ అవుతుంది అని రివర్స్ పంచ్ వేస్తాడు. దీంతో పండు బిక్కమొహం వేయటంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.