బాలయ్య ఆలోచన విధానంలో మార్పులు రావడానికి ప్రధాన కారణం ఆమెనా?

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న బాలకృష్ణ అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా టాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా ఒక వైపు సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరోవైపు ఆహా కోసం వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతమైన సక్సెస్ అందుకుంది.

ఈ షో ఐఎండీబీలో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న షోలలో ఈ కార్యక్రమం ఒకటి.అయితే ఈ కార్యక్రమం ఇంత మంచి అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి కారణం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అని తెలుస్తోంది. తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన ఈమె ఈ కార్యక్రమంలో తన తండ్రిని ప్రత్యేకంగా చూపించడం కోసమే ఎంతో కష్టపడ్డారట.

ఇక ఈ సినిమా సక్సెస్ కావాడమే కాకుండా బాలకృష్ణ గోపీచంద్ మలినేని,అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.కొద్ది రోజులలో బాలకృష్ణ పుట్టినరోజు ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.