ఆ కుట్ర చేసిందెవరో చెప్పేయొచ్చుగా షర్మిల.. ఎందుకు ఆరోపణలు అంటూ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మృతి చెందారు. వైఎస్సార్ మరణించిన తర్వాత ఆయన మృతి విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా షర్మిల సైతం తన తండ్రి వైఎస్సార్ మృతి విషయంలో కుట్ర జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే షర్మిల ఆరోపణలు చేయడంలో తప్పేం లేకపోయినా ఆ కుట్ర చేసిన వ్యక్తులెవరో ఆమె వెల్లడించి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఊరికే ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

షర్మిల రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఈ తరహా కామెంట్ల వల్ల షర్మిల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఈ కామెంట్లు చేశారు. వైఎస్సార్ మరణం గురించి షర్మిల షాకింగ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ స్పందన ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

తనను చంపేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని షర్మిల వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలని షర్మిల ప్రయత్నాలు చేస్తుండగా ఆమె అడుగులు వేస్తున్న తీరు కరెక్ట్ గా లేదని ఎక్కువమంది చెబుతున్నారు. షర్మిల ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. షర్మిల రాజకీయాల్లో సక్సెస్ సాధించడం కష్టమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.