shanmukh: దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత అలాంటి ఫోటోని షేర్ చేసిన షణ్ముఖ్.. ఫోటో వైరల్!

shanmukh: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తన ప్రేయసి దీప్తి సునయనతో మనస్పర్ధలు వచ్చిన అనంతరం వీరిద్దరూ ఒకరి కొకరు బ్రేకప్ చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి బ్రేకప్ తర్వాత ఎవరికి వారు బిజీగా ఉన్నారు. దీప్తి సునయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని షణ్ముఖ్ జస్వంత్ గౌరవిస్తూ తన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తెలిపారు. బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ మొట్టమొదటిసారిగా దీప్తి సునయన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా నేడు (జనవరి 10) దీప్తి సునైనా పుట్టినరోజు కావడంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షణ్ముఖ్ జస్వంత్ హ్యాపీ బర్త్డేDఅని తనకు శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా మొదటిసారిగా దీప్తి సునయన తను షాపింగ్ మాల్ లో కలిసిన ఫోటోని షేర్ చేశారు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్‌ సాంగ్‌ను జత చేయడం విశేషం.

ఇలా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోని ఈ ఫోటో చూసి ఎంతో మంది నెటిజన్లు తిరిగి వీరిద్దరూ తప్పకుండా కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేయడమే కాకుండా దీప్తి సునయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ కూడా త్వరలోనే షూటింగ్ లో పాల్గొన్నబోతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.