Deepthi Sunaina – Shanmukh: బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన చాలామంది కంటెస్టెంట్ లు బయటకు వచ్చిన తర్వాత ఎంతో పాపులారిటీ దక్కించుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన షన్ను విషయంలో మాత్రం ఎంతో భిన్నంగా జరిగింది. ఇతను ఎంతో పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి చాలా నెగిటివిటీతో బయటకు వచ్చారు. అందుకు గల కారణం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన రొమాన్స్ కారణమని చెప్పవచ్చు.
ఇలా సిరితో ఎంతో చనువుగా ఉన్న షణ్ముఖ్ బయటకు వచ్చిన తర్వాత తన ప్రియురాలు దీప్తి సునయన తనని పూర్తిగా దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై షణ్ముఖ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని త్వరలోనే తనతో కలిసి మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు. కానీ నూతన సంవత్సరం సందర్భంగా దీప్తి సునైనా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారి బ్రేకప్ విషయాన్ని బయట పెట్టింది.
నేను షణ్ముఖ్ జస్వంత్ ఎంతో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకొని విడిపోతున్నాము,ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఐదు సంవత్సరాలు మేం ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఉన్నాము.కానీ మాలో ఉన్న రాక్షసులతో పోరాడటం కష్టంగా ఉండటం వల్ల మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పింది.
దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై స్పందించిన షణ్ముఖ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుతూ.. దీప్తి సునైనా ఎక్కడ ఉన్న సంతోషంగా మనశాంతిగా ఉండాలని కోరుకుంటున్నానని, అలాగే ఐదు సంవత్సరాల నుంచి తనకు సపోర్ట్ చేసినందుకు దీప్తి సునయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తను ఎక్కడున్నా సంతోషంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం షన్ను చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.