Shanmukh Jaswanth: నూతన గృహప్రవేశం చేసిన షణ్ముఖ్..ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Shanmukh Jaswanth: తెలుగు ప్రేక్షకులకు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ లో వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. షణ్ముఖ్ జస్వంత్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షణ్ముఖ్ జస్వంత్ నటించిన వీడియో యూట్యూబ్ లో విడుదల అయ్యింది అంటే చాలు కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ ల వ్యూస్ వస్తున్నాయి అంటే అతనికి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక షణ్ముఖ్ జస్వంత్ నటించిన సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇక తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ టైటిల్ ని ఎలా అయినా సరే గెలుస్తాడు అని అందరూ భావించారు. కానీ చివరికి రన్నరప్ గా నిలిచాడు. అయినప్పటికీ విజేత కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇక షణ్ముఖ్ ఎక్కువ వెబ్ సిరీస్ ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాడు. అయితే షణ్ముఖ్ జస్వంత్ కి ఆఫర్లు కూడా వస్తుండటంతో, సినిమాలలో నటించాలా లేక వెబ్ సిరీస్ లో నటించాలా అన్న విషయం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బుతో అదేవిధంగా తన సేవింగ్స్ తో కలిసి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సినిమా కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాకు కొత్త ఇంటి ఖరీదు దాదాపుగా రెండు కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఇక షణ్ముఖ్ జస్వంత్ కు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక యశ్వంత్ గృహప్రవేశ వేడుకకు నటి యూట్యూబ్ శ్రీవిద్య తో పాటు మరికొందరు యూట్యూబర్ లు కూడా హాజరయ్యారు.