బాత్‌రూంలో ఫోటోల‌కు ఫోజులిచ్చిన షారూఖ్ కూతురు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో నటించి కింగ్ ఖాన్‌గా అభిమానుల‌చే పిలిపించుకుంటున్నాడు. జీరో చిత్రం షారూఖ్ ఖాన్ చివ‌రి చిత్రం కాగా, ఆ మూవీ త‌ర్వాత మ‌ళ్ళీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ వివ‌రాలు రివీల్ చేయ‌లేదు. అయితే షారూఖ్ ఖాన్ త‌న‌యు సుహానేఖాన్ త్వ‌ర‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని కూడా ఎప్ప‌టి నుండో ప్రచారాలు జోరుగా సాగుతూ వ‌స్తున్నాయి. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ రావ‌డం లేదు.

షారూఖ్ ఖాన్ ముద్దుల త‌న‌య సుహానే ఖాన్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన ఆమెకు లెక్క‌కి మించిన అభిమానులు ఉన్నారు. అప్పుడప్పుడు త‌న ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ మ‌న‌సులు దోచుకుంటూ ఉంటుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుత‌మైన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు బాత్‌రూంలో దిగిన‌వి కాగా, ఫంకీ పెయింట్ గోడలతో ఆ ఫోటోలు చాలా అందంగా క‌నిపిస్తున్నాయి. నెటిజ‌న్స్ నే కాదు సెల‌బ్రిటీల‌ను కూడా ఈ ఫోటోలు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఆమెని అభిమానించే అభిమానులు త‌మ‌దైన స్టైల్‌లో ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పిల్లలంతా సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ హాలిడే ట్రిప్స్, ఫ్రెండ్స్‌ తో కలిసి ఔటింగ్‌కు వెళ్లిన ఫోటోలు పోస్టు చూస్తూ.. ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుహానే కూడా వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చేకంటే ముందే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తుంది. అయితే సుహానా తండ్రి దారిలో నటన వైపు వస్తుందా? తల్లి దారిలో డిజైనింగ్ వైపు వెళుతుందో, లేదంటే త‌న‌కు న‌చ్చిన ఫీల్డ్‌లో రాణించాల‌ని భావిస్తుందో ఇప్ప‌టికి అభిమానుల‌కి ప్ర‌శ్నార్ధ‌కంగానే మిగిలింది. గ‌తంలో క‌రణ్ జోహార్.. సుహానేని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ని అనేక వార్త‌లు దావానంలా వ్యాపించ‌గా, ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది రానున్న రోజుల‌ల‌లో తెలుస్తుంది.