Serial Artist Lahari: బుల్లితెర ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్.. అరెస్టయిన నటి లహరి!

Serial Artist Lahari: బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న బుల్లితెర నటి లహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా నటి లహరి ఒక బైక్ యాక్సిడెంట్ చేసి అరెస్టయినట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈమె శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో ప్రైవేట్ పెట్రోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఓ వ్యక్తిని మద్యం సేవించి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఆ వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలపాలైన లహరి కారు నుంచి మాత్రం బయటకు రాకపోవడంతో స్థానికులు ఈమెపై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నటి లహరి, ఆమె కారును పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

లహరి యాక్సిడెంట్ చేయడానికి గల కారణం ఆమె మద్యం సేవించి వాహనం నడపడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బాధితుడు ఈమెపై ఏవిధమైనటువంటి ఫిర్యాదు చేయక పోయినప్పటికీ పోలీసులు తనని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఈమె గురించి వస్తున్న ఈ వార్తలపై నటి లహరి ఏ విధంగానూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారడంతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.