మాసివ్ అప్డేట్ : “పుష్ప” సిరీస్ పై ఓ సెన్సేషనల్ న్యూస్ .!

ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలు అచ్చి రావని, హిట్ స్టేటస్ తక్కువ అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ తమిళ్ నుంచి నెమ్మదిగా ఓ సినిమా యముడు, యముడు 2 లు వాటిని బ్రేక్ చేసాయి. కానీ ఆ సక్సెస్ కూడా సరిపోలేదు. కానీ అప్పుడు వచ్చింది మన తెలుగు సినిమా నుంచి “బాహుబలి” సినిమా.

ఆ సినిమా భారీ హిట్ అవ్వడం మళ్ళీ దాని తర్వాత సీక్వెల్ బాహుబలి 2 కూడా వచ్చి సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇండియన్ సినిమా దగ్గర మరిన్ని సీక్వెల్ సినిమాలు చెయ్యడానికి ఫిల్మ్ మేకర్స్ ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాల్లో లేటెస్ట్ భారీ హిట్ “కేజీఎఫ్ 2” కూడా బాహుబలి సిరీస్ హిట్ అవ్వడం వల్ల పుట్టిందే.

మరి ఫైనల్ గా మళ్ళీ వీటి రేంజ్ లో భారీ హైప్ సెట్ చేసుకున్న మరో చిత్రం “పుష్ప”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ అవ్వడంతో ఇప్పుడు పుష్ప ది రూల్ పై అనేక అంచనాలు సెట్టయ్యాయి.

మరి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ మరో బిగ్గెస్ట్ ఊహించని అప్డేట్ ఈ సినిమాపై ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ పుష్ప సిరీస్ లో మూడో సినిమా కూడా ఉండే అవకాశం ఉందట. అవును ఇది నిజమే “పుష్ప చాప్టర్ 3” ని కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని..

ఈ సినిమా స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూ లో మాట చెప్పడం కేజ్రీగా మారింది. సుకుమార్ తనకి ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పారని తప్పకుండా మూడో పార్ట్ కి కూడా స్కోప్ ఉందని తనని కూడా తెలుగు బాగా నేర్చుకోవాలని సూచించారని చెప్పాడు.

మరి ఈ అప్డేట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మామూలుది కాదని చెప్పాల్సిందే. ఒకవేళ రెండో సినిమా హిట్ అయితే మూడో సినిమా వండర్స్ నమోదు చేయడం ఖాయం.