RGV: రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఏ ట్వీట్ చేసినా తెగ వైరల్ గా మారుతుంటుంది. ఇటీవల ఏపీలో టికెట్ల వ్యవహారంపై యాక్టివ్ గా ఉంటూ… టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.
దీనిలో భాగంగానే నిన్న అతడికి ఏపీ మంత్రి పేర్నీ నాని అపాయింట్ మెంట్ ఇవ్వగా.. అతడు వెళ్లి.. సినిమా టికెట్ల రేట్లను పెంచాలని కోరాడు. దీనిపై ప్రభుత్వం వర్మ చెప్పే డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నారు.
అయితే ఈ మీటింగ్ కు సంబంధించి చివరకు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియరాలేదు.
అయితే ఈ చర్చల వల్ల ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ప్రయోజనం చేకూరేలా ఎలాంటి సానుకూల ప్రకటన చేయలేదు. ఇక దీనిలో భాగంగానే.. ఇతర రాష్ట్రాలకు చెందిన టికెట్ రేట్లతో పోల్చుతూ.. వర్మ షాకింగ్ ట్వీట్ చేశాడు.
అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ఒక కారణం అయితే.. ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని.. అంతే కాకుండా థియేటర్లలో ఆక్యూపెన్సీ కూడా 50 శాతం వరకు అనుమతి ఇవ్వడంతో జనవరి 7న విడుదల చేయాల్సి ఉండగా.. ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలచేస్తారనే సమాచారం కూడా లేదు. అయితే తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మహారాష్ట్రలో ఆర్ఆర్ఆర్ సినిమాకు గరిష్టంగా 2,200 రూపాయల వరకు టికెట్ రేటును అనుమతించారని .. ఇదే తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో చూసుకుంటే అదే టికెట్ వెల రూ.200కు కూడా అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా టికెట్లు అనేవి మల్టీప్లెక్స్ లలో రూ. 2200 వరకు ఉంటాయి. సొంత రాష్ట్రంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకొచ్చాడు. ఇక చివరలో కట్టప్పను ఎవరు చంపారు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.