మహేష్ కి పోటీగా సెన్సేషనల్ స్టార్? క్లారిటీ మీకోసం!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు శరవేగంగా సినిమా కంప్లీట్ అయ్యే పనిలో ఉంది. అయితే ఈ చిత్రాన్ని మొదట చిత్ర యూనిట్ సంక్రాంతి బరిలో నిలిపి తర్వాత ఏప్రిల్ నెల 1కి మార్చారు.

మరి ఇప్పుడు ఏ డేట్ కి మహేష్ బీబీహారే సినిమాకి పోటీగా యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పోటీకి రాబోతున్నాడని బజ్ ఇప్పుడు మొదలైంది. పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబోలో ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “లైగర్”.

దీనిపై అయితే పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు తలపడనున్నాయని టాక్. అయితే దీనిపై క్లారిటీ కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పోటీ అయితే ఈ రెండిటి మధ్య ఉండదట. ఒకటి వస్తే డెఫినెట్ గా ఇంకో సినిమా ఆ డేట్ లో రాదట. అయితే ఆ వచ్చే సినిమా ఏది అనేది తేలాల్సి ఉంది..