“రాధే శ్యామ్” సెన్సేషనల్ సింగర్ సాంగ్ రాబోతుందట.!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసి అల్రెడి రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చి కూడా మంచి హిట్ అయ్యింది. దీనితో ఈ లవ్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొలనగా వాటికి తగ్గట్టుగా చిత్ర బృందం మంచి ప్లానింగ్స్ చేస్తున్నారట.

మరి ఈసారి సాంగ్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ తో పాడించిన సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారట. ఇది ఆల్ మోస్ట్ కన్ఫర్మే అట. ఇక ఈ సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎన్ని శిఖరాలు అధిరోహిస్తుందో అనేది వేచి చూడాలి. మరి ఈ సినిమాకి సౌత్ ఆల్బమ్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చెయ్యగా యూవీ మేకర్స్ నిర్మాణం అందించారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 15న ఆసియన్ లెవెల్లో రిలీజ్ కాబోతుతోంది.