Allu Arjun: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా ద్వారా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ తాజాగా మరో సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్ లోకి కూడా అడుగు పెట్టింది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్‌ను నిర్వహించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా బీటీఎస్ ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ ఎన్నో ఆశక్తికరమైన విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. తాను ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నా. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం.
మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఎలాంటి గర్వం లేకుండా ఉన్న వారిని నేను చాలామందిని చూశాను అది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందని అల్లు అర్జున్ తెలిపారు. ఇకపోతే నేను 100 శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
