నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్నో సక్సెస్ లను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన సినిమాలలో ఈ మధ్య కాలంలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సినిమాలకు బోయపాటి శ్రీను దర్శకుడు కావడం గమనార్హం. బాలయ్య ఫ్య్యూచర్ ప్రాజెక్ట్ లు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
గోపీచంద్ మలినేని సినిమాను బాలయ్య ఆగష్టు నాటికి పూర్తి చేయనున్నారని సెప్టెంబర్ నుంచి అనిల్ రావిపూడి బాలయ్య కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా లెజెండ్2 లేదా అఖండ2 అని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
బాలయ్య లేదా బోయపాటి శ్రీను స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో స్టార్ హీరో బాలకృష్ణ తనను మించడానికి వీలు లేదని చెప్పారని సమాచారం. డ్యాన్స్ మాస్టర్ సలీం అనే వ్యక్తిని బాలయ్య డ్యాన్స్ ఎలా నేర్చుకుంటున్నారని సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ అడిగారు.
ఆ ప్రశ్నకు చాలా బాగా నేర్చుకుంటున్నాడని ఫాస్ట్ గా మూవ్ మెంట్స్ చేస్తున్నాడని ఆయన సమాధానమిచ్చారు. బాలయ్యతో మీరు డ్యాన్స్ చేయలేరేమో అని సలీం ఎన్టీఆర్ తో చెప్పగా ఆ తర్వాత బాలయ్య నన్ను మించడానికి వీలు లేదని ఆయన చెప్పారని సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ మాటలు విన్న సలీం షాకయ్యారు.