సీనియర్ ఎన్టీఆర్ తిండి అలవాట్ల గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 300కు పైగా సినిమాలలో నటించి అందులో ఎక్కువ సినిమాలతో విజయాలను అందుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు సీనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. రాముడి పాత్ర వేస్తే రాముడిలా కృష్ణుడి పాత్ర వేస్తే కృష్ణుడిలా సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు కూడా వెరైటీగా ఉండేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రాత్రి ఏ సమయంలో నిద్రపోయినా సీనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడున్నర గంటలకే నిద్ర లేచేవారు. నిద్రలేచిన తర్వాత యోగాసనాలు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని సీనియర్ ఎన్టీఆర్ అల్పాహారం తీసుకునేవారు. పెద్ద సైజ్ లో ఉన్న 24 ఇడ్లీలను సీనియర్ ఎన్టీఆర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారు. ఉదయం ఆరు గంటలకే మేకప్ తో సీనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉండేవారు. తనకు ఉన్న క్రమశిక్షణ వల్లే ఎన్టీఆర్ ఎక్కువ సినిమాలలో నటించడంతో పాటు ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.

ఉదయం ఒక సినిమా షూటింగ్ లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మరో సినిమా షూటింగ్ లో సీనియర్ ఎన్టీఆర్ పాల్గొనేవారు. సీనియర్ ఎన్టీఆర్ కు ఆపిల్ జ్యూస్ అంటే ఎంతో ఇష్టం కాగా రోజుకు నాలుగైదు బాటిల్స్ ఆపిల్ జ్యూస్ ను ఆయన తాగేవారు. సాయంత్రం సమయంలో రెండు లీటర్ల బాదంపాలతో పాటు డ్రై ఫ్రూట్స్ ను తీసుకునేవారు. మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ ను కలుపుకుని తినడానికి ఆయన ఆసక్తి చూపించేవారు.

చెన్నైలో ఉంటే మధ్యాహ్నం సమయంలో ఇంటి భోజనం తినడానికి సీనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేవారని సమాచారం. వైద్యుల సూచనల మేరకు షాట్ గ్యాప్ లో అల్లం వెల్లుల్లి ముద్దను సీనియర్ ఎన్టీఆర్ తీసుకునేవారు. అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనేవారు.