సీనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకు అంత తక్కువ పారితోషికం తీసుకున్నారా?

ప్రస్తుతం ఒక్కో స్టార్ హీరో 30 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోల మార్కెట్ ను బట్టి హీరోలు అడిగిన స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాల బడ్జెట్లు 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటంతో హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.

గత కొన్నేళ్లలో డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతూ ఉండటంతో నిర్మాతలు సైతం పెద్ద సినిమాలను భారీ బడ్జెట్లతో నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. సాధారణ కథలతో పోల్చి చూస్తే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలకు మాత్రం మరింత ఎక్కువ మొత్తం ఖర్చవుతోంది. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలను ఆదరించే బాలీవుడ్ ప్రేక్షకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

అయితే సీనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం మాత్రం కేవలం 200 రూపాయలు కావడం గమనార్హం. మన దేశం సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నారు. ఇప్పుడు ఈ మొత్తం తక్కువే అయినా ఈ సినిమా షూటింగ్ జరిగే సమయానికి ఈ మొత్తం ఎక్కువ మొత్తమే అని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత కాలంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.

మేజర్ చంద్రకాంత్ సినిమా కొరకు సీనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. సంవత్సరం సంవత్సరానికి ఆయన సంపాదన పెరిగింది. సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలు అయిన ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయనను మరిచిపోలేక పోతున్నారు.