సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సైతం ఏపీలో పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా మహానాడు సక్సెస్ కావడంతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పలు సర్వేలలో సీఎం జగన్ పై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా కామెంట్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఎంతమంది నటులు ఉన్నా సీనియర్ ఎన్టీఆర్ కు నటనలో పోటీ ఇచ్చేవాళ్లు లేరనే సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ హైదరాబాద్ కు వచ్చిన వెంటనే మొదట ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత డబ్బుతో రామకృష్ణ థియేటర్ ను నిర్మించారు. థియేటర్ పక్కన సీనియర్ ఎన్టీఆర్ కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు. మాసబ్ ట్యాంక్ లో 5 ఇల్లులు, కాచిగూడ చౌరస్తాలో తారకరామ థియేటర్ ను సీనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 13లో ఉన్న ఇంటిని సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పేరుపై రాశారు. మిగిలిన ఆస్తులను ఆయన కొడుకులు పంచుకున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తుల విలువ కళ్లు చెదిరే మొత్తం అని సమాచారం. సొంతూరులో కూడా సీనియర్ ఎన్టీఆర్ బాగానే ఆస్తులను కూడబెట్టారని బోగట్టా. ఆరేడు తరాలు తిన్నా తరగని స్థాయిలో సీనియర్ ఎన్టీఆర్ ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ గురించి తెలిసి ఆయనను అభిమానించే అభిమానులు సైతం షాకవుతున్నారు.