Roja on Selvamani: సెల్వమణి రేసుగుర్రంలో శ్రుతిహాసన్ లాంటోడు…. రోజా సంచలన వ్యాఖ్యలు!

Roja on Selvamani: జబర్ధస్త్ ఈ పేరు చాలు.. నవ్వులకు కేరాఫ్ గా నిలుస్తుంది. ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోను జనాలు విరగబడి చూస్తుంటారు. దీంతో ఈ షోకు టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి. చిన్న.. పెద్ద అంతా జబర్దస్త్ కామెడి పంచులను ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ షోలో వచ్చిన వారు అనతి కాలంలోనే స్టార్ కమెడియన్స్ లు గా మారారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శీను, హైపర్ ఆది, ఫహీమా ఇలా చాలా మంది క్లిక్ అయ్యారు. సుడిగాలి సుధీర్ ఏకంగా సినిమాల్లో హీరోగా చేస్తున్నారు.

మిగతా వారు సినిమాల్లో కామెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక అనసూయ, రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్లుగా ఫేమస్ అయ్యారు. ఇక రోజా గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుంచి జడ్జిగా కొనసాగుతోంది. తనపై కూడా పంచులు వేసుకుంటూ.. షోకు మరింత అట్రాక్షన్ తెస్తోంది.  ఇదిలా ఉంటే జబర్ధస్త్ లో రోజా తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నెక్ట్ వీక్ వస్తున్న జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దీంట్లో తన భర్త సెల్వమణి గురించి రోజా కామెంట్లు చేసింది.

కమెడీయన్‌ నూకరాజు.. రోజా,సెల్వమణిలను ఉద్దేశించి ఓ సెటైర్‌ వేశాడు. నూకరాజ్‌ టీమ్‌.. రోజా పై స్కిట్‌ చేశారు. ఇందులో ఇద్దరు కమెడీయన్లు రోజా ఇంటికెళ్లి ఆమె కొత్తింటిని చూద్దామనుకున్నారు. ఇంతలో రోజా వస్తుందని తెలిసి ఆమెకి కనిపించకుండా దాక్కున్నారు. రోజా పాత్రలో నటించిన మహిళా కమెడీయన్‌ గాంభీర్యంగా వచ్చి అబ్బాయిలకు అన్యాయం జరిగితే అరగంట ఆలస్యమవుతుందేమోగానీ, అమ్మాయిలకు ఆలస్యమైతే అర నిమిషం కూడా ఆలస్యం చేయనంటూ ఆమె వేసిన పంచ్‌ నవ్వులు పూయించింది.

ఇంతలో స్టేజ్ పైకి వచ్చిన నూకరాజు… నేనే సెల్వమణి అంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఈ నేపథ్యంలో రోజా తన భర్త సెల్వమణి గురించి కీలక కామెంట్లు చేసింది. సెల్వ `రేసుగుర్రం`లో హీరోయిన్‌(శృతి హాసన్‌) లాంటివారని పేర్కొంది. అన్ని లోపలే అనుకుంటాడు. బయటకు చెప్పడని పేర్కొంది. దీంతో యాంకర్‌ అనసూయ అయ్యో అంటూ నవ్వులు పూయించారు. అంతేకాదు నూకరాజుని తాను చెప్పిన డైలాగులను వైట్‌ పేపర్‌పై రాసి ఇవ్వాలని, ఇంటికెళ్లాక సెల్వమణితో చెప్పించుకుంటానని తెలిపి మరో షాకిచ్చింది.