Shekar Kammula: నేను కథను డైరెక్ట్‌ చేయడం కాదు… కథే నన్ను డైరెక్ట్‌ చేస్తుంటుంది: శేఖర్ కమ్ముల

Shekar Kammula: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ విడుదలైన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి. ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్మల అనేక విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో భాగంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. నా కెరీర్‌ లో ని మ్యూజికల్, లవ్‌స్టోరీ చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌ గా నిలిచాయి. దాంతో అలా నామీద ఒక మార్క్‌ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. లీడర్‌ సినిమా చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్‌స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. కాలేజ్‌ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్‌ చేశాను.

అలాగే కుబేర సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే… నేను కథను డైరెక్ట్‌ చేయడం కాదు… కథే నన్ను డైరెక్ట్‌ చేస్తుంటుంది అని తెలిపారు శేఖర్‌ కమ్ముల. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వం వహించిన కుబేర మూవీలో ధనుష్ హీరోగా నటించిన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే హీరో నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.