రెండో విడత నామినేషన్ ఆన్‌లైన్.. నిమ్మగడ్డ కీలక నిర్ణయం..?

nimmagadda ramesh kumar

 ఏపీలో ప్రస్తుతం గ్రామ గ్రామాన ఎన్నికల వేడి రాజుకుంది. అసలు ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాల మధ్య మొదలైన వ్యవహారం చివరికి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభీష్టం మేరకు పంచాయితీ నగారా మోగింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తుందనేది విపక్షాల ఆరోపణలు.

nimmagadda ramesh kumar

 దీనిపై నిమ్మగడ్డ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నామినేషన్ విషయంలో వైసీపీ పార్టీ అధికారులను ఉపయోగించి టీడీపీ సానుభూతి పరుల వేస్తున్న నామినేషన్స్ తీసుకోకపోవటం, ఎదో ఒక వంక పెట్టుకొని నామినేషన్స్ చెల్లకుండా చేయటం లాంటివి చేస్తుంది. దీనితో ఆన్‌లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ నిర్ణయాన్ని పట్టించుకోలేదు.

 ఈ విషయం ఇప్పుడు… ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ ఆగ్రహానికి కారణం అయింది. ఆయన గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లను మరోసారి ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆన్‌లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించినప్పటికీ.. ఎందుకు అమలు చేయలేదో వచ్చి వివరణ ఇవ్వాలని ప్రత్యేకంగా నిమ్మగడ్డ లేఖ రాశారు. ఆన్‌లైన్ నామినేషన్లను ఆమోదించాలని.. పలు రాజకీయ పక్షాలు కోరాయని.. నిమ్మగడ్డ లేఖలో గుర్తు చేశారు.

 ఆన్లైన్ లో నామినేషన్స్ తీసుకునే విధంగా చేస్తే ఎవరికీ భయపడకుండా నామినేషన్స్ వేయటానికి అవకాశం ఉంటుందని విపక్ష పార్టీలన్నీ ఎస్ఈసీని కోరుతున్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. దీనితో మొదటి విడతలో జరిగిన అనేక సంఘటనలను సాక్ష్యాలుగా చూపిస్తూ ఆన్లైన్ లో నామినేషన్స్ స్వీకరించాలని డిమాండ్ చేయటానికి అనేక పార్టీలు సిద్ధం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషనర్ కూడా సంతృప్తి కరంగా లేదని తెలుస్తుంది. కాబట్టి వీలైతే రెండో విడత నుండి ఆన్లైన్ లో నామినేషన్స్ స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది.