Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ఈ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. ఇకపోతే హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటించిన సినిమా కింగ్ డమ్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ, సూర్య నటించిన సినిమా రెట్రో. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఆపరేషన్ సింధూర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ లో నిత్యం ఇలాంటి యుద్ధాలు గొడవలు జరుగుతున్నాయి. వాటికి పరిష్కారం వారికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం, బ్రెయిన్ వాష్ చేయడమే.
కాశ్మీర్ ఇండియాది, కాశ్మీరీలు ఇండియన్స్ అంటూ మాట్లాడారు. పాకిస్తాన్ పై మనం యుద్ధం చేయాల్సిన పనిలేదు అక్కడ వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు భరించలేక వాళ్లే పాకిస్తాన్ గవర్నమెంట్ పై తిరగబడతారు అటు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇలా యుద్ధాలు చేసుకోవడం ఏంటి గత 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా ఇలా గొడవ పడుతున్నారు అంటూ ఆయన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయ్ ఈ కార్యక్రమంలో గిరిజనులను ఏకంగా ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడారంటూ గిరిజన సంఘాలు మండిపడుతూ ఈయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.