సత్యదేవ్ 26 – ఈశ్వర్ కార్తీక్‌- ఓల్డ్ టౌన్ పిక్చర్స్ నూతన చిత్ర ప్రకటన

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన వెర్సటైల్ హీరో సత్యదేవ్‌. విలక్షణ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న  సత్యదేవ్.. ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్ 26వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం క్రైమ్ యాక్షన్ గా వుండబోతోంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెడ్ థీమ్‌తో రూపొందించిన గుర్రం కనిపిస్తుంది. త్వరలోనే సినిమా లాంచ్ కానుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో  ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు కనిపించనున్నారు.

బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

తారాగణం: సత్యదేవ్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
స్క్రీన్ ప్లే: ఈశ్వర్ కార్తీక్, యువ
నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్: ఓల్డ్ టౌన్ పిక్చర్స్
డీవోపీ: మణికంఠన్ కృష్ణమాచారి
సంగీతం: చరణ్ రాజ్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్ సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్