Zebra Movie: ‘జీబ్రా’ మూవీ టీజర్‌ విడుదల!

Zebra Movie: యువ నటుడు సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ’జీబ్రా’ లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాకు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్‌ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Zebra Movie: సత్య దేవ్ ‘జీబ్రా’ గ్లింప్స్ సెప్టెంబర్ 30న రిలీజ్

ఈ క్రమంలోనే తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ కైమ్ర్‌ కామెడీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. మత్తు వదలరా ఫేం సత్య కూడా టీజర్‌లో మరోసారి నవ్వులు పూయించాడు. ప్రియా భవానీ శంకర్‌ , జెన్నిఫర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పుష్పా సినిమాతో ఫేమస్‌ అయిన ధనంజయ (జాలిరెడ్డి) విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. సునీల్‌ సత్యరాజ్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

YS Jagan Powerful Speech About YCP Activists | YS Jagan Action Plan | Chandrababu | PawanKalyan | TR