తమిళనాడు రాజకీయాల్లో శశికళ రీఎంట్రీ… అన్నాడీఎంకే పార్టీ తనదేనని ప్రకటన

sashikala re entry in madras politics

తమిళనాడు రాజకీయాలలో రోజు రోజుకి ఉత్కంఠత పెరిగిపోతుంది. ఇటీవల కాలంలో జయలలిత నెచ్చెలి శశికళ ఆగమనంతో అన్నాడీఎంకే పార్టీలో ఏ క్షణమైనా ఏమైనా జరిగిపోవచ్చంటూ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళ నేరుగా చెన్నైకు చేరుకున్నారు. నాలుగేళ్ళ తర్వాత తమిళ గడ్డపై అడుగుపెట్టిన ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా శశికళ తన వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

sashikala re entry in madras politics
sasikala re entry in madras politics

ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. పైగా, తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు.తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో ఇప్పటికే అర్థమైవుంటుందన్నారు. అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారన్నారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని ప్రకటించారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు, శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండకూడని తమిళనాడు మంత్రులు పదేపదే చెబుతున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. తన కారు ముందుభాగంలో ఆ పార్టీ జెండాను ఉంచారు.

శశికళ.. తమిళ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతోన్నారని అర్ధమవుతుంది. దీంతో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తమిళనాడులో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జయలలిత కన్నుమూత తరువాత.. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సమయంలో ఆమె అనూహ్యంగా జైలుపాలయ్యారు. సరిగ్గా ఎన్నికల ముంగిట్లో ఆమె విడుదల కావడం వల్ల ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ ఆమె చుట్టే కేంద్రీకృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఆమె ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికో అని రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.