సర్కారీ వారి పాట డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా మే 12వ తేదీ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే. సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే కొందరు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా థియేటర్లో ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కూడా సాధించని ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట రికార్డు సృష్టించింది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా అనుకున్న టార్గెట్ చేరుతుందని నిపుణుల అభిప్రాయం.

ఇకపోతే థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయినా కూడా తిరిగి ఆరు వారాలకు ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో జూన్ రెండవ వారం లేదా మూడో వారంలో సినిమాని అమెజాన్ లో విడుదల చేయనున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో నటించారు.ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. ఈ సినిమా విడుదలకావడంతో మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు మనకు తెలిసిందే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా అనంతరం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.