Sarayu: టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియా ఉపయోగించుకొని తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే వారి టాలెంట్ నిరూపించుకొని ఫేమస్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన వారిలో సరయు కూడా ఒకరు. బూతులతో సాగిపోయే తన వీడియోల ద్వారా ఫేమస్ అయిన సరయు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాటిస్పేట్ చేసే అవకాశం కొట్టేసింది.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న సరయు ఎక్కువకాలం బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయింది. అయితే తర్వాత బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్ లో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ నాన్ స్టాప్ సీజన్లో కూడా సరయు ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్ ల తో తరుచు వివాదాలకు పాల్పడుతూ ఉండేది. ఈ క్రమంలో
అరియానా ఒక సందర్భంలో నువ్వు నడుస్తుంటే భూకంపం వచ్చినట్టుంది. నాకు భయం వేస్తుంది అంటూ సరయు శరీరాకృతి మీద కామెంట్ చేసింది. అరియాన అల అనటంతో సరయు చాలా ఫీల్ అయ్యింది.
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద సరయు నాగార్జునతో ఈ విషయం గురించి ప్రస్తావించింది. అయితే ఈ సందర్భంగా అరియాన స్పందిస్తూ.. సరయు నా మీదా కామెంట్స్ చేస్తుంది. నేనూ కూడా తనని సిల్లీ గా కామెంట్స్ చేశా అని చెప్పగా.. నేను పాజిటివ్ గా కామెంట్స్ చేశా, కానీ నువ్వు నా గురించి నెగటివ్ కామెంట్స్ చేసావ్ అని సరయు చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల జరిగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కూడా మళ్లీ ఈ గొడవ ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా సరయు మాట్లాడుతూ నేను అరియాన ని నా మైండ్ నుండి తీసేసాను. తన గురించి అస్సలు పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల అరియానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్టులో ఒక మనిషి నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నారు అంటూ ఎవరు బాడీ షేమింగ్ చేయొద్దని సరయు పోస్ట్ చేసింది. దీంతో అరియాన అన్న మాటలు ఇంకా సరయు మర్చిపోలేదని అర్థమవుతుంది.