‘సారంగ దరియా’ … రికార్డ్స్ బద్దలు కొడుతున్న సాంగ్ !

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన ‘సారంగ దరియా..’ పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. సాయి పల్లవి చేసిన పాట ‘రౌడీ బేబీ..’ ఒక్కటే 8 రోజుల్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కు రీచ్ అయి సారంగ దరియా కంటే ముందుంది.

మిగతా సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ..’, ‘రాములో రాముల..’ పాటలు ‘సారంగ దరియా..’ స్పీడ్ కంటే వెనకబడ్డాయి. బుట్ట బొమ్మ.. పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, ‘రాములో రాముల…’ పాటకు 27 రోజులు పట్టింది. ‘సారంగ దరియా..’ పాటకు సుద్దాల అశోక్ తేజ పాటను రాయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ సీహెచ్ సంగీత సారథ్యం వహించారు. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ‘ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

#SarangaDariya​ | Love story Songs | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch