శాంతి టాకీస్ #SK20తెలుగు & తమిళంలో ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ , సురేష్ ప్రొడక్షన్స్, వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా, ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

‘కాలేజ్ డాన్’ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై హీరో శివకార్తికేయన్ ని నిర్మాత సురేష్ బాబు అభినందించారు. అలాగే SK20విడుదల తేదీని కూడా ప్రకటించారు.

“#SK20 చిత్రాన్ని వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తాం”అని తెలిపారు సురేష్‌బాబు.

ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.