తెలుగునాట వరుస చిత్రాలతో దూసుకుపోతోంది కథానాయిక శ్రీలీల. తాజాగా చైన్నైలో ఓ కళాశాల వార్షికోత్సవానికి హీరో శివ కార్తికేయన్‌తో కలిసి శ్రీలీల గెస్ట్‌గా హజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్‌లో ఆగ్రభాగాన దూసుకుపోతున్న కథానాయిక శ్రీలీల.
పూజా హెగ్డే,రష్మిక మందన్నా వంటి వారిని వెనక్కి నెట్టి తెలుగు నాట వరుస చిత్రాలతో దూసుకుపోతూ హయ్యెస్ట్ పేయిడ్ కథానాయికగా పేరు సంపాదించింది. సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమాలో చివరి సారిగా కనిపించిన శ్రీలీల ప్రస్తుతం ఒక్క పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో మాత్రమే నటిస్తోంది.
తన డాక్టర్ కోర్స్ ఫైనల్ స్టేజస్‌లో ఉండడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించింది. అడపాదడపా ఈ మధ్య ఎక్కువగా ప్రైవేట్ కార్యక్రమాలలో మాత్రమే కనిపోస్తోన్న ఈ ముద్దుగుమ్మ చాలా జ్యెవెలరీ , బట్టల షాప్ లకు అంబాసిడర్‌గా సైన్ చేసింది. ప్రకనటల్లోనూ తానే ముందుంటోంది.
తాజాగా చైన్నైలో ఓ ప్రైవేట్ మెడికల్ నిర్వహించిన వార్షికోత్సవానికి తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి శ్రీలీలగెస్ట్‌గా హజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.